భారత్ పాకిస్థాన్ సరిహద్దులో రైల్వే ట్రాక్ పేలుడు: తప్పిన పెను ప్రమాదం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీగంగారామ్

భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రైల్వే ట్రాక్ పై భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. రాజస్థాన్ లోని శ్రీగంగారామ్ జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని, పేలుడు ధాటికి ట్రాక్ దెబ్బతిని రెండు అడుగుల గుంత ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ మార్గంలో కొద్ది నిమిషాల ముందే ప్యాసింజర్ రైలు వెళ్లడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, ఈ కుట్ర కోణంపై భద్రతా బలగాలు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.