విద్యార్థులకు అలర్ట్: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల భారత సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డిసెంబర్ మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.