బావిలో పడి నలుగురు మైనర్ అన్నదమ్ములు మృతి.
రిపోర్టర్: సునీల్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో పడి నలుగురు మైనర్ అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలంలోని బావి వద్దకు వెళ్లిన పిల్లలు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.