బడంగ్పేట్ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: బడంగ్‌పేట్

బడంగ్పేట్, బీఎన్ రెడ్డి నగర్లలోని పలు వినాయక మండపాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.