అచ్చంపేటలో బరితెగించిన దొంగలు.. బీరువా పగలగొట్టి బంగారం, నగదు చోరీ!

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో దొంగలు పడగ విప్పారు. కాలనీలో నివాసం ఉంటున్న ప్రిన్సిపాల్ పాండు నాయక్ ఇంటిలో అద్దెకు ఉంటున్న శ్రీకాంత్ గది తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి అందులోని ఒకటిన్నర తులాల బంగారం, మూడు వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.