ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే ఇచ్చిన భరోసా

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో పాటు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు రిలే నిరసన చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తామని, ఎంపీల నిధులతో పాటు కంపెనీల సహకారంతో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.