హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి, ఒకరి మృతి
రిపోర్టర్: శివ
స్థలం: World
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ హార్ముజ్ జలసంధిలోని క్వెష్మ్ ఐలాండ్ సమీపంలో ఇరాన్ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనివల్ల చమురు ధరలు వంద డాలర్లకు పెరిగి అనేక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.