మహమ్మద్ షమీని ఎవరూ విస్మరించలేదు: సౌరవ్ గంగూలీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని సెలక్టర్లు విస్మరిస్తున్నారన్న వాదనను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తోసిపుచ్చారు. షమీ ఒక అసాధారణ ఛాంపియన్ అని, దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. వయసు పెరిగే కొద్దీ జట్టులో ఇలాంటి మార్పులు సహజమని, తాను కూడా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గంగూలీ పేర్కొన్నారు.