విజయవాడలో విషాదం సాంబారు గిన్నెలో పడి మహిళ మృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ చిట్టినగర్ లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 20వ తేదీన అన్నదాన ఏర్పాట్లలో భాగంగా 46 ఏళ్ల పద్మ సుజాత అనే మహిళ పెద్ద సాంబార్ గిన్నెను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలు కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.