వన్యప్రాణి ప్రేమికులకు తీపి కబురు: కునో నేషనల్ పార్క్లో నాలుగు చిరుత పిల్లల జననం
రిపోర్టర్: నరేష్
స్థలం: Madhya Pradesh
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో భారత్లో జన్మించిన కేజీపీ12 అనే ఆడ చిరుత నాలుగు కూనలకు జన్మనిచ్చిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ప్రాజెక్ట్ చీతా ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయిన మరుసటి రోజే ఈ అరుదైన ఘటన చోటుచేసుకోవడం విశేషం. ఈ తాజా జననాలతో దేశంలో మొత్తం చిరుత పులుల సంఖ్య యాభై ఆరుకు చేరిందని అధికారులు తెలిపారు.