బెంగళూరులో మహిళల రక్షణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహణ

రిపోర్టర్: సునీల్ స్థలం: బెంగళూరు

మహిళలపై హింసను అరికట్టేందుకు చట్టపరమైన హక్కులు మరియు పరిష్కారాలపై బెంగళూరులోని క్రైస్ట్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిర్భయ నిధుల ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు మూడు వందల మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని హింసను గుర్తించడం, స్పందించడం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు.