ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢిల్లీ

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం డిసూ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన పోలింగ్ లో నలభై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనగా హైకోర్టు ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం కొనసాగుతోంది.