ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదు: హైకోర్టు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
శాసనసభ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడానికి వీళ్లేదు. ప్రజాప్రతినిధులపై దాడి ఘటనను హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది. సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం కేవలం స్పీకర్‌కే ఉంటుందని తేల్చిచెప్పింది.