'క్రాస్‌ ఫైర్, విడాకులు ఉండవు': కూటమి విజయంపై మంత్రి లోకేశ్ స్పష్టత

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

రానున్న 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు కలిసే పోటీచేస్తాయని, క్రాస్‌ ఫైర్, మిస్‌ ఫైర్, విడాకులు ఉండవని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన తెదేపా కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి అభ్యర్థుల విజయం ఏకపక్షం కావాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. వైకాపా నాయకులు రాజకీయం ముసుగులో కుల, మత విభేదాలు రెచ్చగొడుతున్నారని, వారి దుష్ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.