హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రయోగంలో అద్భుత ఫలితాలు అందించిన కృత్రిమ మేధస్సు ట్యూటర్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
సాంప్రదాయ తరగతి గదులకంటే కృత్రిమ మేధ ట్యూటర్ ద్వారా విద్యార్థులు రెట్టింపు వేగంతో విషయాలను నేర్చుకోవచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. భౌతికశాస్త్ర బోధనపై నిర్వహించిన ప్రత్యేక ప్రయోగంలో ఈ అంశం స్పష్టమైందని పరిశోధకులు గ్రెగోరి కెస్టెన్, కెల్లీ మిల్లర్ పేర్కొన్నారు. విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందించడంలో కృత్రిమ మేధ ట్యూటర్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఈ అధ్యయనం ద్వారా తేలిందని వారు వివరించారు.