రాజీవ్‌నగర్‌లో పోలీసుల నిర్బంధ తనిఖీలు.. సీఐ రమణమూర్తి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో లక్షేటిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీలోని పలు ప్రాంతాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేసి, ప్రజలకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సీఐ కోరారు. తనిఖీల్లో భాగంగా 11 ద్విచక్ర వాహనాల పత్రాలను పరిశీలించి యజమానులకు అప్పగించారు. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.