సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించాలి: సదాగోపన్ రమేష్
రిపోర్టర్: శివ
స్థలం: India
ఐపీఎల్ 2027 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మార్పుపై చర్చ మొదలైంది. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేష్ సూచించారు. శాంసన్ నాయకత్వ అనుభవం, జట్టులో అతని కీలక పాత్రను పరిగణనలోకి తీసుకోవాలని, కెప్టెన్సీ మార్పు జట్టుకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, కేవలం కెప్టెన్ మార్పుతోనే సమస్యలు తీరవని ఆయన స్పష్టం చేశారు.