మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Telangana

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతో విసుగు చెంది ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని Bharat Rashtra Samithi (BRS) స్పష్టం చేసింది. వచ్చే రెండేళ్లలో కచ్చితంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేది కేసీఆరేనని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొంటూ ఆ పార్టీ అధికారిక సామాజిక మాధ్యమ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసింది.