లక్నోలో షాకింగ్ ఘటన: లింగ మార్పిడి వివాదంతో కన్నతల్లిని హతమార్చిన కుమారుడు
రిపోర్టర్: నరేష్
స్థలం: Lucknow
లక్నోలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో గురువారం తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటనలో కన్నతల్లినే ఓ మైనర్ హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే తన కోరికను వ్యతిరేకించిన నలభై రెండు సంవత్సరాల తల్లితో వివాదం తలెత్తడంతో, ఆమెను ఇనుప రెంచ్‌తో తలపై బలంగా కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.