రామాయణంలో సీత పాత్ర వదులుకున్నానన్న వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందన

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

కేజీఎఫ్ చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధిశెట్టి తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామాయణ చిత్రంలో సీత పాత్ర వచ్చిన అవకాశాన్ని తాను వదులుకున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చినా ఎంపిక కాలేదని తెలిపారు. వెంకటేశ్ సరసన నటిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆమె తన వ్యక్తిగత విశేషాలను వెల్లడించారు.