కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సిపిఎం తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

అనధికార కరెంట్ కోతల వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ను సరఫరా చేసి పంట పొలాలను కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.