దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం మరోసారి స్తంభించనుందని యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వెల్లడించింది. యూనిట్ల పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. వారాంతపు సెలవులు తోడు కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుసగా ఐదు రోజుల పాటు సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఎస్బీఐ ఆదివారం కూడా శాఖలను తెరిచి ఉంచుతామని స్పష్టం చేసింది.