మంచిర్యాల జిల్లాకు దశాప్త కాలం: తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించిన బాల్క సుమన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా ఏర్పాటు అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేయడం జరిగిందని బాల్క సుమన్ - మాజీ ఎమ్మెల్యే చెన్నూర్ వెల్లడించారు. మంచిర్యాల జిల్లా సాధనలో మరియు రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోరాట యోధులను ఈ వేదికపై ఘనంగా సత్కరించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.