షాకింగ్ ఘటన: అన్నాచెల్లెలుగా నటిస్తూ సహజీవనం, గదిలో యువకుడు ఆత్మహత్య
రిపోర్టర్: వెంకట్
స్థలం: బేగుసరాయ్
బీహార్ లోని బేగుసరాయ్ జిల్లాలో అన్నాచెల్లెలుగా నటిస్తూ సహజీవనం చేస్తున్న ఒక జంట మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. ప్రియురాలు అర్చన కుమారితో గొడవడిన అమృత్ శర్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో గదిలో లాక్ వేసి ఉన్న ప్రియురాలిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, మాజీ ప్రియుడి బెదిరింపులే ఈ మరణానికి కారణమని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడని అధికారులు వెల్లడించారు.