తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: సూర్యాపేట
తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనుల్ లో ఎటువంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఈ సమావేశంలో స్పష్టంచేస్తూ సమీక్షను ముగించారు.