నాయబ్ సింగ్ సైని తలపాగాపై భగవంత్ మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: చండీగఢ్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని మధ్య తలపాగా వివాదం చెలరేగింది. సైని కారులో రెడీమేడ్ తలపాగా పెట్టుకుని పంజాబ్‌లో కృత్రిమ రాజకీయాలు చేస్తున్నారంటూ మాన్ విమర్శించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సైని, సిక్కు గురువులను, పంజాబ్ ప్రజలను మాన్ అవమానించారంటూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.