దేశంలో రాహుల్ గాంధీ మాత్రమే భయపడవద్దంటూ కీలక సందేశమిస్తున్నారని సుభంకర్ సర్కార్ వెల్లడి
రిపోర్టర్: రమేష్
స్థలం: Kolkata / Delhi
మహాత్మా గాంధీ మార్గంలో నడుస్తున్న రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ఎవరికీ భయపడవద్దని, ఇతరులను భయపెట్టవద్దని పిలుపునిస్తున్న ఏకైక నేత అని వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సర్కార్ పేర్కొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేస్తూ, గాంధీ మార్గమే దేశానికి శ్రీరామరక్ష అని వెల్లడించారు.