సుప్రీంకోర్టు ఆదేశాల వేళ ముంబైలో భారీ ఆక్రమణల తొలగింపు
రిపోర్టర్: మహేష్
స్థలం: Mumbai
సుప్రీంకోర్టు సీరియస్ అయిన మరుసటి రోజే ముంబైలోని బోరివలి ఈస్ట్ ప్రాంతంలో బెస్ట్ బస్ స్టేషన్ కోసం కేటాయించిన స్థలంలో ఉన్న వాణిజ్య కట్టడాలను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం తొలగించారు. ఆక్రమణలను తొలగించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడే జీతాలను నిలిపివేయాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ మేరకు కార్పొరేషన్ వర్గాలు ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.