ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో లెక్చరర్ మరియు ఓవర్‌మ్యాన్ అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆమె మాజీ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్, సింగరేణి ఓవర్‌మ్యాన్ బొమ్మక రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచార వేధింపుల నేపథ్యంలో నిందితుడు నవీన్ కుమార్ విద్యార్థినితో బలవంతంగా పురుగుల మందు తాపించి ఆత్మహత్య లేఖ రాయించి ఆసుపత్రికి తరలించి పరారయ్యాడు. చికిత్స పొందుతూ బాధితురాలు సెప్టెంబర్ 13న మృతి చెందడంతో పోలీసులు ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.