తిరుమలలో బ్రహ్మోత్సవాలు: సామాన్య భక్తుల కోసం అన్ని వీఐపీ దర్శనాలు రద్దు
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల కొండపై సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయించిందని బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే ఉత్సవాల వేళ ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. సిఫార్సు లేఖల హడావుడిని తగ్గించి సర్వదర్శనం క్యూలైన్లలో వచ్చే భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.