నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న రవితేజ ఇరుముడి సినిమా
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఘన విజయం సాధించింది. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.