క్యాట్-2026 పరీక్ష రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.

రిపోర్టర్: సురేష్ స్థలం: భారతదేశం

భారతీయ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు క్యాట్-2026 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 22 వరకు పొడిగించాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 29న మూడు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.