తిరుమలలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణతో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో తిరుమల పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.