పరిషత్ పోలింగ్ వేళ నిబంధనలు ఉల్లంఘిస్తే తాటతీస్తామన్న అధికారులు
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో గురువారం జరగనున్న ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పలు కఠిన ఆంక్షలు విధించారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయాలని తెలిపారు. చట్టం అమలులో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరిస్తూ ఎవరితోనూ ఘర్షణలకు దిగవద్దని అధికారులు సూచించారు.