కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్

రిపోర్టర్: THADI BHAVANI స్థలం: విజయనగరం

విజయనగరం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నుంచి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పారదర్శకమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.