మట్టి విగ్రహాలు తయారు చేసిన మాలేగాం విద్యార్థులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం మాలేగాం ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయుడు శేషోళ్ల మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వయంగా మట్టి గణనాథుల విగ్రహాలను తయారు చేశారు. రసాయన విగ్రహాలతో జరిగే కాలుష్యాన్ని వివరించి, ఈ మట్టి విగ్రహాలను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.