అక్టోబర్ 4న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో ఆయన కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.