స్వల్ప మార్పులతో త్వరలో మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ ఫోన్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
గూగుల్ సంస్థ త్వరలో సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు టెక్ నిపుణులు తెలిపారు. గూగుల్ పిక్సెల్ 11ఎ పేరుతో రానున్న ఈ కొత్త ఫోన్ డిజైన్ మరియు కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. గూగుల్ పిక్సెల్ 10ఎ మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఇది వస్తోందని, ఇందులో టెన్సర్ జి6 చిప్సెట్ అమర్చనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ సిల్వర్, పర్పుల్ మరియు గ్రే బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుందని టెక్ వర్గాలు వెల్లడించాయి.