కర్ణాటకలో నకిలీ మందుల గుట్టు రట్టు చేసిన ఎఫ్డీఏ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బెంగళూరు
కర్ణాటకలో నకిలీ మందుల తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలు తీసుకుంది. బెంగళూరు దక్షిణ జిల్లాలోని బిదాడి సమీపంలో దాడులు నిర్వహించి రూ. 5.05 కోట్ల విలువైన నకిలీ మందులు, యంత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 16 రిటైల్, హోల్సేల్ మందుల లైసెన్సులను రద్దు చేయగా, మరో 8 లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.