గుర్గావ్లో భయానక ఘటన: క్యాబ్ డ్రైవర్ దాడితో ప్రయాణికురాలికి చేదు అనుభవం
రిపోర్టర్: శివ
స్థలం: Gurugram
ఢిల్లీ విమానాశ్రయం నుంచి గుర్గావ్కు క్యాబ్లో బయలుదేరిన తనీషా శర్మకు డ్రైవర్ వేధింపులతో భయానక అనుభవం ఎదురైందని బాధితురాలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. యాప్లో చూపిన రూ.625 కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ డ్రైవర్ డిమాండ్ చేశాడని, బగేజీ ఇవ్వకుండా అడ్డుకుని ఇంటి గేటు దూకి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు క్యాబ్ సంస్థ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.