స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ సీఐటీయూ డిమాండ్

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఐటీయూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని కమిటీ కన్వీనర్లు నాగమణి, మహాలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళలపై శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.