సూర్యాపేటలో ప్రపంచ స్థాయి కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు సింగరేణి నిధులు
రిపోర్టర్: రమేష్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో రోజువారీగా సుమారు 60 వేల అల్పాహారాలను అందించేలా ఈ బృహత్తర ప్రాజెక్టును మంజూరు చేశామన్నారు. ఈ ప్రత్యేక సదుపాయం కల్పనకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్‌తో పాటు ఇతరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.