యాదవులంతా ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలన్న బండి సదానందం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మందమర్రి

మంచిర్యాల జిల్లా మందమర్రిలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బండి సదానందం హాజరై మాట్లాడారు. యాదవులు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి సంఘాన్ని బలోపేతం చేసేందుకు త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.