విద్యార్థుల బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే: ప్రధాని మోదీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. డిజిటల్ యుగంలో పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ వ్యసనాన్ని క్రీడల ద్వారా తగ్గించాలని సూచించారు. డ్రగ్స్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని, కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా విద్యార్థుల బాల్యాన్ని సజీవంగా ఉంచే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. పుస్తకాలకు మించి విద్యార్థుల జీవితాల్లోకి ఉపాధ్యాయులు అడుగుపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.