ఫ్రిజ్ పేలి నలుగురు మృతి, విషాదంలో వినాయక చవితి.

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ಕರ್ನಾಟಕ

కర్ణాటకలోని బెలాగావిలో ఘోర ప్రమాదం జరిగింది. చావత్ గల్లీలో ఫ్రిడ్జ్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు. వినాయక చవితి వేడుకల సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.