కర్ణాటకలో పెట్రోల్ పై వివాదం: ఈ20 ఇంధన నాణ్యతపై ఆయిల్ కంపెనీల స్పష్టత
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
కర్ణాటకలో విక్రయిస్తున్న పెట్రోల్ లో ఇథనాల్ మోతాదు అధికంగా ఉందన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పందించాయి. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ, నిర్దేశిత సాంకేతిక నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించలేదని స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న ఈ20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు కట్టుబడి ఉందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.