షూటింగ్ సమయంలో గుర్రంపై నుంచి పడిపోయిన అగ్రనటి రేఖ: కేసీ బొకాడియా వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: Mumbai
ప్రముఖ నటి రేఖ సినిమా షూటింగ్ సమయంలో గుర్రంపై నుంచి కిందపడిపోయినట్లు దర్శకుడు కేసీ బొకాడియా వెల్లడించారు. ఫూల్ బనే అంగారే చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఉదయపూర్ లోని స్టేడియంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. గుర్రం అదుపుతప్పి జనసందోహంలోకి దూసుకెళ్లడంతో రేఖ కింద పడ్డారని, అయితే ఎలాంటి భయం లేకుండా వెంటనే లేచి మళ్లీ షాట్ లో పాల్గొన్నారని ఆయన ప్రశంసించారు.