భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత ఓఐసీకి లేదన్న విదేశాంగ శాఖ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: న్యూఢిల్లీ
భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అధికారం ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీకి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని, రాజకీయ ప్రేరేపిత ప్రచారాలతో ఈ వాస్తవాన్ని మార్చలేరని కుండబద్దలు కొట్టింది. న్యూయార్క్‌లో జరిగిన ఓఐసీ కాంటాక్ట్ గ్రూప్ భేటీలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌కు సరైన సలహా ఇవ్వాలని ఓఐసీకి సూచించింది.