పాలేరు జలాశయం నీటి మట్టాన్ని పరిశీలించిన ఖమ్మం కలెక్టర్ దివాకర
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుసుమంచి
పాలేరు జలాశయంను శుక్రవారం కలెక్టర్ దివాకర టీ.ఎస్ జలాశయాన్ని పరిశీలించారు. నీటి మట్టం, ఇన్ ఫ్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో మాట్లాడి నీటి విడుదలపై సూచనలు చేశారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.