గ్రామ అవసరాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్న సర్పంచి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

గుండ్లబావి గ్రామ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సర్పంచి నందగిరి వెంకటేష్గౌడ్ తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో వి.బి.-జి. రామ్జీ-375 ఉపవర్గాల పనులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వనరుల పటం ద్వారా అవసరాలను గుర్తించి, ప్రణాళికలో చేర్చి పనులు చేపడతామన్నారు. ప్రజలు, రైతులు తమ అవసరాలను తెలియజేసి భాగస్వాములు కావాలని కోరారు.